VC Sajjanar: అందం చూసి టెంప్ట్ అవ్వకండి

VC Sajjanar: సాంకేతికత రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల రూపం కూడా మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన హెచ్చరిక ప్రస్తుతం విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త తరహా మోసాలపై ఆయన స్పష్టమైన అవగాహన కల్పించారు. ఒంటరిగా ఉన్నారా, వెంటనే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి, అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్న ప్రకటనలు వాస్తవానికి ఒక ప్రమాదకర ఉచ్చుగా...