MP C.V. Shanmugam: ‘నాకు నయనతార కావాలి.. సీఎం నా కోరిక తీరుస్తారా..?’

MP C.V. Shanmugam: మహిళల భద్రత, గౌరవం అనే సున్నితమైన అంశంపై నిర్వహించిన నిరసన కార్యక్రమం ఒక వివాదానికి కేంద్రంగా మారిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే నిర్వహించిన ఈ నిరసనలోనే ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ సి.వి.షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ప్రముఖ నటి నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయని, అవి సామాజిక విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రావడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ...