Congress Strategy: హైదరాబాద్లో హస్తం స్ట్రాటజీ!
Congress Strategy: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదిక సిద్ధమవుతోంది. నగర పాలక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సాధారణ ప్రకటనలా కనిపించినా, వాస్తవానికి ఇది భారీ రాజకీయ వ్యూహానికి సంకేతంగా మారింది. 300 మంది యోధులు కావాలంటూ పార్టీ అంతర్గతంగా ఇచ్చిన పిలుపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో బలమైన నాయకత్వాన్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇంకా 4 నుంచి 5 నెలల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు...