State Elections 2026: అసలు సిసలు తీర్పు అప్పుడే..
తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. విజయ్ ఎంట్రీతో మారిన సమీకరణాలు పుదుచ్చేరిలో రాజకీయ రసవత్తరం కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ లక్ష్యం State Elections 2026: దేశ రాజకీయాల్లో మరోసారి కీలక ఘట్టం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, ఉత్తర దిశలో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు ముమ్మరమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా వివిధ వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందా, కేరళలో పినరయి విజయన్ వరుసగా మూడోసారి...