Telangana: ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్
Telangana: తెలంగాణ రాష్ట్రంలో పేదలకు శాశ్వత నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూరి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తమార్చి నాలుగో వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సర్వే ద్వారా గుడిసెల్లో నివసిస్తున్న వారు, టార్పాలిన్ వంటి తాత్కాలిక ఏర్పాట్లతో ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్న పేదలను గుర్తించనున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా పర్యటిస్తూ పూర్తి వివరాలను సేకరించి నివేదిక రూపొందించనున్నారు. అనంతరం అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ గృహ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా గుడిసెల్లో...