Bihar News: మైనర్ బాలుడితో ప్రేమలో పడ్డ బాలిక.. ఇంట్లో తెలిశాక ఏమైందంటే?

Bihar News: బీహార్ రాష్ట్రంలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విషయంలో తన కుటుంబం అంగీకరించకపోవడంతో ఒక మైనర్ బాలిక తీసుకున్న చర్య స్థానికంగా కలకలం రేపింది. తన ప్రియుడితోనే పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆ బాలిక ఏకంగా హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కి నిరసన వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన బీహార్‌లోని మోతిహారి ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన 33KV హైటెన్షన్ విద్యుత్ లైన్ స్తంభంపైకి ఆమె ఎక్కి కూర్చోవడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ చర్చకు దారి...