Manisha Kalyan: ఫుట్బాల్ మ్యాచ్లో 30 గజాల దూరం నుంచి అద్భుత గోల్
Manisha Kalyan: భారత మహిళా ఫుట్బాల్ క్రీడలో మరోసారి సంచలన క్షణం ఆవిష్కృతమైంది. యువ క్రీడాకారిణి మనీషా కళ్యాణ్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆసియా స్థాయి ప్రతిష్టాత్మక పోటీల్లో భాగంగా చైనీస్ తైపీ జట్టుతో జరిగిన పోటీలో ఆమె కొట్టిన అద్భుత గోల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీస్తోంది. దాదాపు 30 గజాల దూరం నుంచి ఆమె కొట్టిన ఫ్రీ కిక్ గోల్ స్థంభం పైభాగాన్ని తాకుతూ నెట్లోకి దూసుకెళ్లడం చూసి క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ క్షణం మైదానంలో ఉన్న ప్రేక్షకులను మాత్రమే కాదు.. తరువాత వీడియో చూసిన వేలాది మందిని కూడా ఉర్రూతలూగించింది. ప్రస్తుతం...