Telangana: రెండు కొత్త విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. శంకుస్థాపనకు సన్నాహాలు ప్రారంభం
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి దిశగా మరో కీలక శుభవార్త అందింది. రాష్ట్రంలో ప్రయాణ సౌకర్యాలను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా చర్చలో ఉన్న రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అవసరమైన అనుమతులు రావడంతో పాటు భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి దశకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి...