WeatherAlert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

Weather Alert: వేసవి కాలం ప్రారంభమైన కొద్ది రోజులకే భానుడి తీవ్రత పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే మండిపడుతున్న ఎండలు మధ్యాహ్నానికి మరింత భయంకరంగా మారుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ మండుటెండల మధ్య ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న కొన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాల వల్ల ఎండల తీవ్రత కొంత మేర తగ్గి ప్రజలకు...