Digestion Naturally: శరీరం కంటే ముందే జీర్ణక్రియకు వృద్దాప్యం వస్తుందా?
Digestion Naturally: ఇటీవలి కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ బలహీనపడటం సహజమే అయినప్పటికీ, ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మందిలో ఈ సమస్య ముందుగానే కనిపిస్తోంది. శరీరం ఇంకా యవ్వనంగా ఉన్నప్పటికీ జీర్ణవ్యవస్థ మాత్రం ముసలిదైనట్లుగా పని చేయడం ప్రారంభిస్తోంది. దీనికి ప్రధాన కారణం మన పొట్టలో ఉండే మంచిసూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతినడమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ సూక్ష్మజీవుల సమూహం జీర్ణక్రియను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆహారపు అలవాట్లు మారిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం, నిద్రలేమి...