Business Idea: ఏ బిజినెస్‌ను చిన్న చూపు చూడకండి.. టిఫిన్ సెంటర్ ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు!
Business Idea: ప్రస్తుత కాలంలో చాలా మంది యువత, చిన్న వ్యాపారులు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి ప్రతిరోజూ నగదు ఆదాయం వచ్చే వ్యాపారాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, జీవన వ్యయం పెరగడం వంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న స్థాయిలో ప్రారంభించగల వ్యాపారాల్లో టీ, టిఫిన్ కేంద్రం ఒక మంచి అవకాశంగా మారుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేకుండా, కొద్దిపాటి ఏర్పాట్లతో ప్రారంభించగల ఈ వ్యాపారం ప్రస్తుతం పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా కస్టమర్లు...