Darshan Update: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Darshan Update: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా వారాంతం ముగిసే సమయానికి భక్తుల సంఖ్య మరింతగా పెరిగి ఆలయ పరిసరాలు సందడిగా మారుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ ఆదివారం నాటికి గణనీయంగా పెరిగి, సోమవారం ఉదయానికి మరింత ఎక్కువైంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోవడంతో పాటు దర్శనం కోసం వేచి ఉన్న క్యూలైన్లు ఆలయ పరిసర ప్రాంతాల వరకు విస్తరించాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్రమంగా క్యూ లైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా క్రిష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఆలయ...