Social Media: భార్యా భర్తల మధ్య సెల్ ఫోనే చిచ్చు పెడుతోందా?
Social Media: ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషుల జీవన విధానం కూడా పూర్తిగా మారిపోతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా ప్రభావం కుటుంబ సంబంధాలపై కూడా పడుతోంది. నిపుణులు నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో భార్యాభర్తల మధ్య పెరుగుతున్న గొడవలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా సోషల్ మీడియా వినియోగం కూడా ఉన్నట్లు వెల్లడైంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారడానికి ఇది కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ తీసుకుని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ చూడటం ప్రారంభిస్తారు. రోజంతా వాటిలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు....