Ramadan 2026: భారత్లో రంజాన్ పండుగ మార్చి 20 హా.. లేదా 21 హా?
Ramadan 2026: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. రంజాన్ నెల చివరి వారంలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ పండుగకు సన్నాహాలు ప్రారంభించారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఈద్ ఉల్-ఫితర్ (రమదాన్) ఒకటి. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల మొదటి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. ఒక నెల పాటు ఉపవాసం పాటించిన తర్వాత సంతోషంగా జరుపుకునే ఈ పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ఆనందంగా గడుపుతారు. పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పేదలకు దానం చేయడం వంటి సంప్రదాయాలు కూడా ఈ పండుగలో ముఖ్య భాగంగా ఉంటాయి. ఇస్లాం మతంలో ఉన్న ఐదు...