Scheme: పీఎం కిసాన్ మీకు రాలేదా?.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే..
Scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రైతులకు ముఖ్యమైన సహాయం అందించే పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. మార్చి 13న అస్సాంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయగా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఈ విడతలో సుమారు 22వ విడత కింద కేంద్ర ప్రభుత్వం రూ.18,640 కోట్లను విడుదల చేసింది. దాదాపు 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున నిధులు జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కొంతమంది రైతుల పేర్లు లబ్దిదారుల జాబితాలో ఉన్నప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని సమాచారం వస్తోంది. అలాంటి...