కుక్క పిల్లను ఒడిలో పడుకోబెట్టుకుని అమ్మ ప్రేమను పంచిన వానరం!
ఆధునిక సమాజంలో బంధాలు, అనుబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయని తరచూ వినిపిస్తోంది. కన్నవారు, తోబుట్టువులు, రక్తసంబంధికుల మధ్య కూడా స్వార్థం, ఈర్ష్య, ద్వేషాలు పెరిగి మనుషులు ఒకరితో ఒకరు దూరమవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మూగజీవాలు మాత్రం ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జాతి భేదాన్ని కూడా పట్టించుకోకుండా ఇతర జీవాల పట్ల చూపుతున్న అనురాగం ఎంతో మందిని ఆలోచింపజేస్తోంది. మానవత్వం మసకబారుతున్న సమాజానికి మూగజీవాలు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అరుదైన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో చోటుచేసుకుంది. నగరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో ఒక వానరం దారి తప్పి ఒంటరిగా తిరుగుతున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకుని...