Rain Alert: ఇదిగో వెదర్ రిపోర్ట్.. ఇక వర్షాలే వర్షాలు
Rain Alert: మార్చి నెలలోనే ఎండ తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాతావరణ శాఖ చల్లటి సమాచారం ఇచ్చింది. పశ్చిమ హిమాలయాల వైపు నుంచి ప్రభావం చూపుతున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో పడే ఈ వర్షాలను ముందస్తు వర్షాలుగా పరిగణిస్తారు. వీటి ప్రభావంతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో సగటున 5 డిగ్రీల వరకు తగ్గుదల నమోదైనట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. సోమవారం రోజున కనిష్ట ఉష్ణోగ్రత...