Gas Shortage: కట్టెల పొయ్యి మళ్లీ వచ్చేసింది..

Gas Shortage: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనాలతో కిక్కిరిసే చిన్న చిన్న హోటళ్లు, టీ దుకాణాలు, అల్పాహార కేంద్రాలు ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల హోటళ్లు తాత్కాలికంగా మూతపడగా, మరికొన్ని చోట్ల పాతకాలపు వంట విధానాలు (కట్టెల పొయ్యి)ను మళ్లీ ఉపయోగంలోకి తెచ్చారు. ముఖ్యంగా ఆలయ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి హోటల్‌లో కనిపించిన...