Muhammad Ayub: ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వరంగల్ డీసీసీ అధ్యక్షులు
Muhammad Ayub: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నగరంలోని చింతల్ ప్రాంతంలో ఉన్న జామియా మసీద్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు, మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉపవాసం ముగించుకున్న అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదు ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్ అయూబ్.. పవిత్ర...