Bad News: భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ రేట్లు
Bad News: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వల్ల పలు రంగాలపై ప్రభావం పడుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు భారతదేశంలోని సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజ్డ్ తాగునీటి బాటిల్ మార్కెట్‌పైనా పడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా వేసవి కాలం దగ్గరపడుతున్న సమయంలో ఈ పరిణామాలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో చమురు ధరలు పెరగడం ప్రారంభమైంది. చమురు ఆధారిత ఉత్పత్తులైన ప్లాస్టిక్ తయారీకి...