Lucknow: అర్దరాత్రి ప్రియుడితో శృంగారం చేస్తూ పట్టుబడ్డ వివాహిత.. ఆపై దారుణం
Lucknow: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో కుటుంబాన్ని కలవరపరిచే దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని ఆమె అత్త చూడటంతో పరిస్థితి విషాదకరంగా మారింది. విషయం బయటపడుతుందనే భయంతో కోడలు, ఆమె ప్రియుడు కలిసి ఆ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఈ ఘటనను సహజ మరణంలా చూపిస్తూ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినా, చివరకు అనుమానంతో చేసిన ఫిర్యాదు కారణంగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 3 అర్ధరాత్రి సమయంలో భంకర్పూర్ బసేలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ...