Telangana: సినిమా టికెట్ రేట్ల పెంపుపై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే

Telangana: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో కొనసాగుతున్న న్యాయపరమైన వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సినిమా టికెట్ ధరలను పెంచాలనుకుంటే ప్రభుత్వం ముందుగానే నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించింది. ముఖ్యంగా సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందు టికెట్ ధరల పెంపుపై...