Annadata Sukhibhava: రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు రిలీజ్

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ద్వారా ఉపశమనం కలిగించింది. రైతుల ఆర్థిక భారం తగ్గించి వ్యవసాయ పనులకు తోడ్పడే ఉద్దేశంతో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఒకేసారి ఆర్థిక సహాయం అందింది. ప్రభుత్వ సహాయంతో వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడి ఖర్చులను తీర్చుకునే అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో...