TVS Orbiter V1: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్!

TVS Orbiter V1: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంస్థ ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. తక్కువ ధరలో ఆధునిక సౌకర్యాలు కలిగిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి....