Atrocious: కాలేజీ అమ్మాయిల ఫోటోలు తీసి..

Atrocious: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా గురజాడ గాయత్రి కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థినుల ఫోటోలను AI టెక్నాలజీని ఉపయోగించి మార్ఫింగ్ చేసిన ఘటన బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలోనే చదువుతున్న కొందరు విద్యార్థులు ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ విద్యార్థినుల ఫోటోలను మార్పింగ్ చేసి అనుచితంగా వినియోగించారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయం బయటపడిన వెంటనే విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ప్రకారం.. వారి కుమార్తెల ఫోటోలను అనుమతి లేకుండా సేకరించి వాటిని మార్పింగ్ చేసి బయటకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య వల్ల తమ పిల్లల గౌరవం దెబ్బతిందని, ఇది...