Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వ స్పష్టత
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పథకం కింద నిధులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్న అంశంపై గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగా తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన రావడంతో రైతుల్లో కొంత ఊరట కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ విషయంపై కీలక ప్రకటన చేస్తూ ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం...