LPG Supply: ఇక సిలిండర్లపై టెన్షనొద్దు.. గ్యాస్ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్

LPG Supply: పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు సరఫరాలపై ప్రభావం చూపవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో కొంత ఆందోళన కలిగించాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో గ్యాస్ కొరతకు ఎలాంటి అవకాశం లేదని, వినియోగదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన తరువాత సాధారణంగా ఎలా సరఫరా జరుగుతుందో అలాగే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్యాస్...