Telangana: పేద ప్రజల కోసం కొత్తగా 31 ఆసుపత్రుల నిర్మాణం
Telangana: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు పెద్ద చికిత్సల కోసం ప్రజలు రాజధాని లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమీప మండల కేంద్రాలు, చిన్న పట్టణాల్లోనే నిపుణుల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందించింది. గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందేలా కొత్త ఆసుపత్రులను నిర్మించడం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రులను ఆధునీకరించడం వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోంది. ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలోనే మెరుగైన వైద్యసేవలు పొందేలా ఆరోగ్య రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి...