War on Iran: దేశంలో గ్యాస్ బాంబ్ పడనుందా?
War on Iran: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో చమురు, వంటగ్యాస్ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికే చమురు, గ్యాస్ కొరత సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరగగా, మరికొన్ని దేశాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై కూడా పడుతుందా అనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను పెంచే ఆలోచన లేదని స్పష్టత ఇచ్చినప్పటికీ వంటగ్యాస్ సరఫరా పరిస్థితి ఎలా ఉంటుందనే సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు...