Lifestyle: ఈ వ్యాధులన్నీ కంట్రోల్.. నిద్రపోయే 3 గంటల ముందు ఈ ఒక్క పనిచేయండి
Lifestyle: ప్రస్తుత కాలంలో వేగవంతమైన జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు మనుషులను వెంటాడుతున్నాయి. పని ఒత్తిడి, తినే ఆహారం, నిద్రలేమి వంటి కారణాల వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అత్యంత అవసరంగా మారింది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, అనుసరించే జీవనశైలి శరీర ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే సమయానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేయడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు...