ICC Events: ఇక ఫ్యాన్స్‌కు పండగే!.. 8 భారీ టోర్నమెంట్స్‌కు ప్లాన్ చేసిన ఐసీసీ

ICC Events: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే కీలక ప్రకటన చేసింది. ప్రపంచ క్రికెట్‌కు సంబంధించిన ప్రధాన పోటీలను ఒకే దిశలో సక్రమంగా నిర్వహించేందుకు రాబోయే సంవత్సరాల మెగా క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ప్రణాళిక ప్రకారం 2031 వరకు జరిగే ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించింది. వచ్చే 5 సంవత్సరాల్లో మొత్తం 8 ప్రముఖ టోర్నమెంట్‌లు నిర్వహించబడనున్నాయి. ఇందులో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ కూడా చోటు చేసుకోనున్నాయి. ఈ భారీ ప్రణాళికతో ప్రతి ఏడాది క్రికెట్ అభిమానులకు ప్రపంచ...