Love Incident: అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఆపై దారుణం

Love Incident: అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఘటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. యువతి ఇంటి సమీపంలోని భవనం మేడపై నుంచి కిందపడిన యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ సంఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. యువకుడిపై హత్యాయత్నం జరిగిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆనందపురం మండలం పరిధిలోని యడ్లవారి కల్లా గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. అదే మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన యువతితో అతనికి గతంలోనే పరిచయం ఏర్పడింది. కొంతకాలం వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం...