Rain Alert: మార్చి 15 నుంచి భారీ వర్షాలు!
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 15 నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటిగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. ఆ తర్వాత వాతావరణ మార్పులు వేగంగా పెరిగి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 16 లేదా 17 తేదీల నుంచి రాష్ట్రమంతటా వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీంతో...