SI Muthyam Rajender: యువతకు మత్తు పదార్థాల ప్రమాదాలపై వివరణ

SI Muthyam Rajender: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు చైతన్యం కల్పించే కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటంతో పాటు సమాజాన్ని ఆరోగ్యకరమైన దిశలో నడిపించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాయపర్తి పరిధిలోని పలు గ్రామాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాయపర్తి పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని మైలారం, కొండూరు, కొత్తూరు గ్రామాలలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు...