Wardhannapet Police: యువత చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి

Wardhannapet Police: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వర్ధన్నపేట పరిధిలో మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం సమాజానికి ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తుందో విద్యార్థులకు వివరించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలనే సందేశాన్ని అందించారు. మంగళవారం వర్ధన్నపేట ప్రాంతంలోని వివిధ విద్యాసంస్థల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్, ఇల్లంద ఉన్నత పాఠశాల, కట్రియాల పాఠశాల, ఉప్పరపల్లి పాఠశాలలో...