Minister Ponguleti Srinivas: త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
Minister Ponguleti Srinivas: వరంగల్ నగర సమగ్రాభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్దిపై దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్‌ను అభివృద్ది పరచాలన్న కృత నిశ్చయంతో వరంగల్ నగర అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. వరంగల్...