SI Srinivas: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

SI Srinivas: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఐనవోలు ఎస్సై శ్రీనివాస్ అన్నా రు. మంగళవారం మండల కేంద్రంతో పాటు నందనం, పున్నేలు, కొండపర్తి గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో కలిసి మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మత్తు జీవితాలను నాశనం చేస్తుందని, యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా స్పోర్ట్స్‌పై ఆసక్తి చూపడానికి గాను విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను ఎస్సై శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ అధికారి,...