Bhimadevarapalli: గట్లనర్సింగాపూర్‌లో విద్యార్థులకు పరీక్ష పరికరాల పంపిణీ

Bhimadevarapalli: గట్లనర్సింగాపూర్ గ్రామంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామ నాయకత్వం విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా మరో మంచి కార్యక్రమం నిర్వహించింది. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందిస్తూ గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ ఆదర్శప్రాయంగా నిలిచారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయాలని భావించి, తన స్వంత ఖర్చులతో అవసరమైన పరీక్ష పరికరాలను అందజేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరీక్షలు రాయబోయే మొత్తం 54 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లు, పెన్సిల్స్ వంటి సామగ్రిని పంపిణీ చేశారు. గ్రామంలో...