Pooja Gandhi: ‘దండుపాళ్యం’ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి..

Pooja Gandhi: క్రైమ్ కథలతో ప్రేక్షకులను షాక్‌కు గురి చేసిన దండుపాళ్యం సినిమా గురించి ఇప్పటికీ సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. 2012లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో కన్నడ సినీ పరిశ్రమలో భారీ సంచలనాన్ని సృష్టించింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. భయానకమైన కథ, క్రూరమైన సంఘటనలు, నిజ జీవితానికి దగ్గరగా చూపించిన విధానం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం పలు థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శితమైంది.  ...