Rama Navami 2026: భద్రాచలం సీతారాముల కళ్యాణం కోసం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
Rama Navami 2026: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపుతాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం క్షేత్రంలో జరిగే కళ్యాణోత్సవం, పట్టాభిషేక మహోత్సవాలకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీలలో జరగబోయే ఈ పవిత్ర కార్యక్రమాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు...