Madhya Pradesh: ఛీ.. ఛీ.. మరీ ఇంత దారుణమా?.. 90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజాన్ని కలచివేసే దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖాండ్వా జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనలకు కారణమైంది. వయస్సు మించిన ఓ వృద్ధురాలిపై అమానుషంగా జరిగిన ఈ దాడి గురించి తెలిసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఈ ఘటన ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఖాండ్వా జిల్లాలోని ఒక గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న 90 సంవత్సరాల వృద్ధురాలిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వారు ముసుగులు ధరించి వచ్చి వృద్ధురాలిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ...