HPV Vaccine: బాలికల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు
HPV Vaccine: తెలంగాణ ప్రభుత్వం సూచించిన కార్యాచరణకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వరంగల్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నర్సంపేటలో ప్రత్యేకంగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమైన ఈ కార్యక్రమానికి వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది హాజరయ్యారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నర్సంపేట సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్...