Warangal: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారదా

Warangal: వరంగల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న జిల్లా వేర్ హౌజ్ గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. అధికారులు మరియు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశీలన జరిగింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్దిష్ట వ్యవధిలో ఈవీఎంలను పరిశీలించడం జరుగుతుంది....