CI Pulyala Kishan: మడికొండ పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

CI Pulyala Kishan: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మడికొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మిని సీఐ పుల్యాల కిషన్ వారి సిబ్బందితో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సీఐ కిషన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని చాటిచెప్పే ప్రత్యేకమైన రోజు అని అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబ బాధ్యతలను మాత్రమే కాకుండా సమాజంలో అనేక రంగాల్లో ముందంజలో నిలుస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో విజయాలను సాధిస్తూ సమాజానికి...