CI Kranthi kumar: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

CI Kranthi Kumar: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పరకాల సీఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు. పరకాల పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర, వారి కృషి, వివిధ రంగాల్లో వారు సాధిస్తున్న విజయాలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మహిళా కానిస్టేబుళ్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో మహిళలు చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలు బాధ్యతతో పనిచేస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ, తమ ఉనికిని, ప్రతిభను చాటుకోవడంతో పాటు వివిధ రంగాలను శాసిస్తున్నారని...