Chahat Bajpai: హనుమకొండ జిల్లాను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తాం

Chahat Bajpai: హనుమకొండ జిల్లాను ఆధునిక నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించింది. జిల్లాను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతో కూడిన మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్ పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి ఆదివారం దేవన్నపేట, గోపాలపూర్, ఉనికిచెర్ల మరియు ధర్మసాగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు పలు అభివృద్ధి ప్రణాళికలకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ముఖ్యంగా “మా సిటీ” పేరుతో రూపొందించనున్న వెంచర్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను...