Women Health: గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు ఉచిత టీకా

Women Health: మహిళల ఆరోగ్య రక్షణకు కీలకమైన చర్యగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు ప్రత్యేక టీకా కార్యక్రమం ప్రారంభమైంది. 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలు తప్పనిసరిగా ఈ టీకాను తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. మహిళల్లో వేగంగా పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ కేసులను తగ్గించడానికి ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ఉపయోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆదివారం ఈ టీకా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. నగర మేయర్ గుండు సుధారాణి మరియు...