Crude Oil: మాకు ఎవరి తొక్కలో పర్మిషన్ అవసరం లేదు.. USకు భారత్ కౌంటర్
Crude Oil: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరా అంశం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి భారత్కు ఒక నెలపాటు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ ప్రకటనపై భారత్ స్పష్టమైన మరియు ఘాటైన స్పందన వ్యక్తం చేసింది. దేశానికి అవసరమైన ఇంధనాన్ని ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడి నుంచే కొనుగోలు చేయడం తమ హక్కు అని, ఇందుకు ఎలాంటి దేశ అనుమతి అవసరం లేదని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలో చోటు...