Warangal: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలను శాలువాతో సత్కరించిన కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ స్టార్ త్రినేత్రం, ఖిల్లా వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని 37వ డివిజన్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ముందుండి నాయకత్వం వహించారు. సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలను గుర్తించి వారికి శాలువాలు కప్పి సత్కరించారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్న మహిళలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత...