Nalgonda: వెలిమినేడులో SFI, DYFI ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ
స్టార్ త్రినేత్రం, నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. సంక్రాంతి క్రీడల సందర్భంగా గెలుపొందిన వారికి శుక్రవారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం 8వ వార్డు మెంబర్ నాతి కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా నేత జిట్ట నగేష్ , డీవైఎఫ్ఐ రాష్ట్ర, జిల్లా కార్యదర్శి కోట రమేష్, మల్లం మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి వారి నాటకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులు మాట్లాడుతూ క్రీడలు...